Andhra Mahabharatamu 3.1.337
Āndhra Mahābhāratamu 3.1.337
- Language
- Telugu
3.1.337
సీ. హరుచేత సంప్రాప్తవరుఁడయ్యె నరుఁ డని | యెఱిఁగి యింద్రుండు ధనేశ ధర్మ
వరుణాశ్వినులతోడ సురగణ సహితుఁడై | దివ్యవిమానముల్ దివమునందు
వెలుఁగంగఁ గౌరవకులవీరు పాలికి | వరదుఁ డై గరుణతో వచ్చె; నట్టి
యవసరమ్మున ఘనరవగభీరం బైన | మధురవాక్యమున ధర్మప్రభుండు
ఆ. ప్రీతి నిట్టులనియె బీభత్సునకు ‘ధర్మ | నిత్య! పాండుపుత్త్ర! నీకు మెచ్చి
వరము లిచ్చు వేడ్క వచ్చిరి నెయ్యురై | యమరనాథుఁ దొట్టి యమరులెల్ల.