Andhra Mahabharatamu 3.1.338
Āndhra Mahābhāratamu 3.1.338
- Language
- Telugu
3.1.338
వ. వీరలం జూడు’ మని దివ్యదృష్టి యిచ్చి ‘నీవు నరుండను పూర్వఋషివి; బ్రహ్మనియోగంబున మనుష్యుండవై యుత్తమ క్షత్త్రియకులంబున నుద్భవిల్లితి; మఱి సూర్యాంశజుండైన కర్ణుని, దేవ దైత్య దానవ గంధర్వ యక్ష రాక్షసాంశజులైన రాజులను వధియింతు; నీ కక్షయకీర్తి యగు’ నని దండధరుం డప్రతివారణం బైన దండంబు విధియుక్తంబుగా నిచ్చిన.