Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.1.345

Āndhra Mahābhāratamu 3.1.345

Language
Telugu

3.1.345

వ. మాతలియు నర్జునుఁజూచి ‘సురాసురకిరీటతటఘటితరత్నప్రభాభాసురపదుండైన మహేంద్రుండు మీయయ్య భవద్దర్శనం బపేక్షించి నిన్ను నమరావతికి రాఁబనిచె, రాజసూయాశ్వమేధ శతంబులం జేసిన వారికైనను దుర్లభం బీరథంబు, దీని నెక్కు’ మనిన నర్జునుండును గంగాస్నాన పవిత్రీకృత గాత్రుండై దేవఋషి పితృతర్పణంబులు చేసి మాతలి ప్రయుక్తంబైన యా దివ్యరథం బెక్కి.