Andhra Mahabharatamu 3.1.344
Āndhra Mahābhāratamu 3.1.344
- Language
- Telugu
3.1.344
సీ. వారిదమార్గంబువలన మహానీల | వైజయంతీ విభవంబు వెలయ,
నాబద్ధవివిధరత్నావళిప్రభఁ జేసి | రమ్యమై రోదోంతరంబు వెలుఁగ,
నురునేమిరవమున నుర్వరాధర దరీ | ముఖములు ప్రతిశబ్ద ముఖరితంబు
లగుచుండ, నానావిధాయుధంబులు దాల్చి, | యశనివిద్యుత్సహస్రాభిశోభి
ఆ. తాభ్రసదృశమై మహాజవాశ్వాయుత | వాహ్యమాన మైన వరరథంబు
మఘవునాజ్ఞఁ జేసి, మాతలి యుక్తమై | యింద్రతనయుఁ డున్నయెడకు వచ్చె.