Andhra Mahabharatamu 3.1.392
Āndhra Mahābhāratamu 3.1.392
- Language
- Telugu
3.1.392
మధ్యాక్కర. ‘నీ నిదేశంబున నరిగి పార్థుండు నిష్ఠతోఁ దపము
మానుగాఁ జేయుచునున్నవాఁ డేల మసలెనో రాక?
వాని ధర్మస్థితుఁ బాసియున్న యివ్వర్షముల్ యుగ స
మానంబు లైనవి మనకు నతని సమాగమకాంక్ష.