Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.2.186

Āndhra Mahābhāratamu 3.2.186

Language
Telugu

3.2.186

వ. బాహుకుండును రథశాల రథాశ్వంబుల బంధించి రథసమీపంబున విశ్రమించియుండె; నంత దమయంతి బాహుక వార్‌ష్ణేయులతోడ వచ్చిన ఋతుపర్ణుం జూచి విఫలమనోరథయై, యుండనోపక, కేశిని యను దానిం బిలిచి’ ‘ఋతుపర్ణు నయోధ్యాపతింగా వార్‌ష్ణేయు సూతపుత్త్రుంగా నెఱింగితి; బాహుకుం డను వాఁ డెవ్వండో? వానియందు నా హృదయంబు ముదితం బగుచున్నయది; మన పర్ణాదునకుఁ బ్రతివచనం బిచ్చినవాఁడు వాఁడ కావలయు; వానికడకుం బోయి యెఱింగి ర’ మ్మని పంచిన, నదియును బోయి బాహుకుం, గని ‘దమయంతి నీ కుశలం బడుగఁ బుత్తెంచె; నిందుల కేమి కారణంబున వచ్చి?’ తనిన దానికి బాహుకుం డిట్లనియె.