Andhra Mahabharatamu 3.4.284
Āndhra Mahābhāratamu 3.4.284
- Language
- Telugu
3.4.284
వ. అనిన విని ధర్మనందనుం డనుజసహితుం డై కృష్ణునిం బ్రశంసావచనంబుల నభినందించి, మార్కండేయుం జూచి, ‘మునీంద్రా! భవత్ప్రసాదంబున నత్యద్భుతకథాశ్రవణపరితోషితుల మైతిమి; కలియుగంబున సకలధర్మలోపం బగు నని చెప్పుదురు; తత్ప్రకారం బెఱింగింపవే!’ యనిన నతం డతని కి ట్లనియె.