Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.4.287

Āndhra Mahābhāratamu 3.4.287

Language
Telugu

3.4.287

సీ. సత్యంబు నరులకు సంక్షిప్త మగు; సత్య | హాని నాయువు గడు నఱిగిపోవు;
నాయువు దఱిఁగిన నల్పంబు లగు విద్య; | లల్పవిద్యలను మోహంబు మిగులు;
మోహంబువలనఁ బై ముసురు లోభంబు; లో | భావేశమునఁ గామ మగ్గలించుఁ;
గామంబుపెంపునఁ గడఁగుఁ గ్రోధంబు; క్రో | ధనంబున వైర మెంతయును బెరుఁగు;
ఆ. వైరమున నశేషవర్ణులు నన్యోన్య | పీడ సేయుచును విభిన్నబుద్ధి
నొక్కఁడొకని మేర నుండక వర్ణ సం | కరము సేయఁగలరు కలియుగమున.