Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.4.301

Āndhra Mahābhāratamu 3.4.301

Language
Telugu

3.4.301

సీ. పదియాఱువర్షముల్‌ పరమాయు వయ్యెడు | ధరణీశ! కలియుగాంతమున వినవె;
యేడును నెనిమిదియేండ్ల ప్రాయంబునఁ | బ్రజ లుద్భవింతురు భామినులకు;
ద్రవ్యవిహీనులై దాత యొక్కఁడు లేక | యన్యోన్యతస్కరు లగుదు రెందు;
నెఱిఁగెడువారును నెంతయుఁ గ్రూరు లై | చెనసి పాపంబు సేసెదరు సూవె!
తే. యన్నవిక్రయ మొనరింతు రఖిలజనులు, | వేదవిక్రయు లగుదురు విప్రవరులు,
పణ్యయోనుల యగుదురు పద్మముఖులు | గష్టతర మైన యక్కలికాలవేళ.