Andhra Mahabharatamu 3.4.317
Āndhra Mahābhāratamu 3.4.317
- Language
- Telugu
3.4.317
వ. అనిన విని యుధిష్ఠిరుండు ‘మునీంద్రా! నీయానతిచ్చిన వాక్యంబు లన్నియు నవహితుండ నై వింటి; నింతకుమున్ను నా యోపిన తెఱంగున లోభమాత్సర్యాది దుర్గుణంబులు పరిహరింతు; నింకను భవదుక్తం బైన ధర్మశాసనంబును బ్రయత్నంబునం బాలించెద’నని యతనికిఁబ్రణమిల్లి మఱియును బ్రాహ్మణప్రభావంబు వినువాఁ డై యతనిం బ్రార్థించినఁ, దద్విషయం బైన యితిహాసం బతనికి నమ్మహాముని యిట్లని చెప్పె.