Andhra Mahabharatamu 3.4.366
Āndhra Mahābhāratamu 3.4.366
- Language
- Telugu
3.4.366
ఉ. ‘అక్కట! నే నెఱుంగనె మహాగుణభూషణు నమ్మహాత్ము న
న్నిక్కడఁ బెక్కుమాఱులు ననేకభయంబులఁ బొందకుండఁగా
నక్కటికంబుతోడఁ దగ నాతఁడు గైకొని కాచెఁ గాదె! పెం
పెక్కిన యన్నరోత్తముని నెన్నఁటికిన్ మఱవంగవచ్చునే?