Andhra Mahabharatamu 3.5.414
Āndhra Mahābhāratamu 3.5.414
- Language
- Telugu
3.5.414
వ. ధృతరాష్ట్రసూనుండు భవదీయ బలశౌర్యంబులపేర్మి యెఱుంగుం గావునఁ దన్ను నవశ్యంబును విడిపింతు రని మనదెస బద్ధాశుం డై యుండు; నిది మనకుఁ బుణ్యంబును గీర్తియుం జేకొను సమయంబు; ని న్నింత నిర్బంధింప వలవ; దేన యరుగుదు; నిప్పుడు యజ్ఞదీక్షితుండ నై యున్నవాఁడఁగావున నాకుం జనరాదు; మీరు వేగఁ జని గంధర్వులం బ్రియపూర్వకంబుగా ననునయించి సుయోధను విడిపించునది; సామవచనంబులం దీరకున్నఁ బరాక్రమంబుననైనం బ్రతివీరుల నోర్చి కార్యంబు దీర్చునది; నా చేయు జన్నంబు సఫలంబు సేయుం’ డనిన భీముం డెట్టకేనియు నియ్యకొనియె; నర్జునుండును ధర్మరాజు పనుపు గైకొని కురురాజుచెఱ దలఁగఁ బ్రతిజ్ఞసేసె; నకుల సహదేవులు నుత్సాహసమేతు లయి; రన్నలువురు నాముక్త కవచులు, నాబద్ధ తూణీరులు, నాకలిత కార్ముకులు, నారూఢ రథులు నయి, యగ్రజు వీడ్కొని, యతిత్వరితగతి నడచినం గౌరవసైన్యం బంతయు వారిం గూడుకొని సింహనాదంబులు సెలంగం జనియె; ని ట్లరిగి వారలు గంధమాదనంబున కయిచనుచున్న యవ్వియచ్చరానీకంబుం గూడ ముట్టిన.