Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.6.394

Āndhra Mahābhāratamu 3.6.394

Language
Telugu

3.6.394

సీ. ‘అమ్మ! నీ కెంతయు హర్షంబుగా నొక | వార్త నే నెఱిఁగింతు వనజవదన!
నామాట నిజముగా నమ్ముము వినవె! య | వింధ్యుఁడు నా నొక్కవృద్ధదైత్యుఁ
డనఘుండు రామహితాన్వేషి యై నీకు | నాశ్వాస మొనరింప నబల! నన్ను
బనిచెను; విను, నిన్నుఁ బాసిన పిదప ల | క్ష్మణుఁడును దాను సేమమునఁ గలసి
ఆ. యఖిలవానరేంద్రుఁ డైన సుగ్రీవుతోఁ | జెలిమి సేసి, యిపుడు శీఘ్రమునన
వీరవరుఁడు నిన్ను విడిపించు పనికినై | యొదవి యుత్సహించి యున్నవాఁడు.