Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 4.2.292

Āndhra Mahābhāratamu 4.2.292

Language
Telugu

4.2.292

సీ. వామాక్షి రుచిర లావణ్యంబు భావించుఁ | దన్వంగి రూపు చిత్తమున నిలుపుఁ,
గంబుకంధరచెన్ను కైవడి తలపోయు | నంగన సౌకుమార్యముఁ దలంచు,
భామిని సహజ విభ్రమ మెదఁ గీలించుఁ | బడఁతి చెయ్వులు మదిఁ బట్టుకొలుపు,
మానిని గరువంపు మాటపొం దూహించు | దళితాబ్జముఖి తిన్నఁదనము మెచ్చు,
తే. నడరి కోర్కులు చిఱ్ఱుముఱ్ఱాడ వెడఁగు | పడిన యుల్లంబు పట్టునఁ బఱుపఁ దనకు
వశముగాకున్న నెంతయు వంతఁబొందుఁ |, జింత యెసకంబు వడిగొని చిక్కువఱుప.