Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 4.2.295

Āndhra Mahābhāratamu 4.2.295

Language
Telugu

4.2.295

సీ. ‘పడఁతి నన్నూఱడఁ బలికిన భంగిన | నిచ్చమై నిక్కకు వచ్చునొక్కొ!
వచ్చి తొల్లిటియట్ల వడిఁ ద్రోచిపోవక | పొలఁతి యింపెసలారఁ బొందునొక్కొ!
తలపోఁతఁ గలిగి యమ్మెలఁత వచ్చుటకు నొం | డొక వింత పుట్టకయుండునొక్కొ!
గంధర్వు లేవురు గలరని చెప్పె న | న్నెలఁతుక మాటలు నిక్కమొక్కొ!
తే. తెఱవ చిడిముడిపాటు సుదేష్ణ యెఱిఁగి | వేడ్కఁ బనిపంచు టుడిగి రా విడుచునొక్కొ!
మదనుఁ డింతికి నొజ్జయై మతకములును | నదను నెఱిఁగించి నాకడ కనుచునొక్కొ!