Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 4.2.310

Āndhra Mahābhāratamu 4.2.310

Language
Telugu

4.2.310

సీ. ‘కెంగేలుఁ గేలితోఁ గీలించి నెయ్యంపు | మాటలఁ దగు మాఱుమాట లార్తుఁ
గుచము లురంబునఁ గుదియించి క్రమమున | నిఱిసిన కౌఁగిట నింపొనర్తు,
నంగుళంబుల నల్ల నలకలఁ గబళించి | కెమ్మోవి యాని యెక్కింతుఁ గాయ్వు,
మనము మనంబునఁ బెనఁచి కేళికిఁ జొచ్చి | సతిఁ దేల్తు సౌఖ్యరసంపునిట్టఁ,
తే. దనివు మొదలైనఁ జిగురొత్తు తమకమునకుఁ | బ్రాఁకు వెట్టుచు మగుడఁ బైఁబడుచు నింతి
వింత భంగుల కెలయించి వెకలిఁజేసి | యభిమత క్రీడనములకు నలవరింతు.’