Andhra Mahabharatamu 4.4.250
Āndhra Mahābhāratamu 4.4.250
- Language
- Telugu
4.4.250
వ. ఇట్లు గనుంగొని, మధ్య దక్షిణ వామాగ్ర పశ్చిమోత్తర భాగంబుల నిట్టిట్టి వారలు నడచుచున్న వారని సారథితో నేర్పడం బలికి, ‘వీరలలో నురగకేతనుండు లే,డతఁడు గోవులం గొనిపోవ నోపు; నిరామిషంబైన యీ సేనతో నని సేయం బని లేదు; వీర లెయిది యడ్డపడి తడవు సేయకుండునట్లుగా; ముట్టికొని పసులన్ బెట్టించి, దొరయును నేల గడవం బోవక యుండఁ బొదువవలయు’ నని చెప్పి యతని నద్దెసకుఁ దేరు వఱుపం బనిచి, గురుకృప గాంగేయులకుఁ జరణ సమీప స్థలంబుల నిలువ రెండును, కర్ణాభ్యర్ణ ప్రదేశంబులం జన రెండునుగా నాలుగేసి యమ్ము లేసిన, నా సవ్యసాచిం జూచి యాచార్యుండు పరిసరవర్తులగు నాప్తజనంబులతో నల్లన ‘యర్జునుం డింత యొప్పియుండునే!’ యని యగ్గించి వెండియు.