Andhra Mahabharatamu 4.5.207
Āndhra Mahābhāratamu 4.5.207
- Language
- Telugu
4.5.207
వ. ఇట్లు కవిసి రథంబులం గడచి కవ్వడిం దలపడియె; భీష్మ ద్రోణాది యోధవీరులు నొక్కుమ్మడి మగిడి యధిపతి తోడన నిగిడి క్రీడియరదంబుఁ బొదివిరి; తక్కిన బలంబులు నంతకుమున్ను కాంతేయు దెస మరలి చూచుచుం బాఱుచునికిం జేసి యేలినవాఁ డఱుముటయును దొరలు తెగువకుం జొచ్చి తిరుగుటయుం గని తెంపుసేసి కూడికొని రభసంబునం జుట్టుముట్టి యతనిపైఁ గ్రందుకొన నడరె; నవ్విధంబున వివిధ వ్యూహంబు లగు బహుయోధయూధంబులు గురిసిన యనేకాస్త్ర శస్త్రంబులు నానాప్రకారంబులఁ గుప్పంగూరలుగాఁదొరఁగినం బెరిఁగిన శౌర్యసంరంభంబున విజృంభించి విజయుం డాశ్చర్య ధుర్య నిరతిశయ రయభరిత(భుజ)కరయుగళుం డయి రథరథ్య సారథి స్వాంగంబులు కాచికొని తన తోడంబుట్టువుల ప్రతిన లూహించి యొండుసేయ నొల్లక, సపరివారంబుగా ధార్తరాష్ట్రుల భంగపెట్టం దలంచి, యింద్రదైవత్యంబును సత్యసంపాతంబును నరాతిసైన్య దైన్య సంపాదనంబును నగు సమ్మోహనాస్త్రంబుం బ్రయోగించిన.