Andhra Mahabharatamu 4.5.221
Āndhra Mahābhāratamu 4.5.221
- Language
- Telugu
4.5.221
వ. అని చెప్పిన పితామహు హితవచనంబు లాకర్ణించి సంగ్రామాతికామియుం గోపాటోపఘూర్ణమాన మానసుండు నగు నమ్మానవేశ్వరుండు నిట్టూర్పు నిగిడించి, యుద్రేకంబు దక్కి నిలిచెం; దక్కటివారలు నూర్జితంబగు నర్జునానలంబు నాలోకించి ధార్తరాష్ట్రు రక్షణ తాత్పర్యంబున శౌర్యంబు సాలించి, భీష్మువాక్య ప్రకారంబు సేసి; రిట్లందఱు ముందర దమవచ్చిన వంకన తిరిగి యరుగుచున్నం గని కిరీటి శంఖరవ జ్యానాదంబులు సెలంగఁ గొండొకదవ్వు వెన్నడిం దఱిమి బిరుదులతోడి గొడుగులును, నడియాలంబులతోడి సిడంబులును వైపించుకొని తృప్తిం బొంది మరలువాఁడై యెల్లవారును వినం బెద్దయెలుంగునం బోయి వచ్చెద నని చెప్పి, గాంగేయ ద్రోణ కృపాచార్యులకుఁ బ్రణామబాణంబు లేసి వారి వీడ్కొనినవాఁడై, మిట్టకోలల రారాజుమకుటంబు మణులు డులిచి యతనికిం జెప్పినవాఁడై, యఖర్వబాహా గర్వ నిర్వహణంబు మెఱయ నప్పుడు మధ్యందినమార్తాండప్రచండుం డగుచుండఁ, గౌరవవీరు లతనిం దేఱి చూడనుం జాలక చని; రతండును జూపఱం దోలి నిలిచిన మదపుటేనుంగు చందంబున నిలిచి విరాటతనయున కిట్లనియె.