Andhra Mahabharatamu 4.5.231
Āndhra Mahābhāratamu 4.5.231
- Language
- Telugu
4.5.231
వ. అను వచనంబు లియ్యకొనుచుం జని, శమీవృక్ష సమీపంబున నిల్చి, గాండీవాది సాధనంబులు పూర్వ ప్రకారంబున నిక్షేపింప నియోగించి, కపిధ్వజ దేవదత్త కిరీటాది దివ్యపరికరంబుల సవినయంబుగాఁ బ్రార్థించి యంతర్థానంబు సేయించి యెప్పటి సింహపతాక రథంబున బంధింపం బనిచి విరాటతనయుండు నిజాయుధంబులు గైకొని రథికుండయి వచ్చునట్లుగాఁజేసి, తొంటిచందంబునం దలచీర యలవరించికొని సారథియై సవ్యసాచి నొగ లెక్కె; నట్టి సమయంబునఁ బురందరాది బృందారకులును దేవముని సిద్ధగంధర్వాదులును బాండుప్రముఖ రాజలోకంబును నాశ్చర్యహర్షాయత్తచిత్తులయి సమర విషయంబు లయిన మాటలాడుచు నిజనివాసంబుల కరిగి; రిట నరుండు నుత్తరు నాలోకించి ‘నీ విజయంబు పురంబున ఘోషింప గోపాలురం బుచ్చు’ మనిన నతం డది దెఱంగుగాఁ గైకొని యట్ల చేయ, నిట్లు నిగూఢంబుగాఁ బట్టణంబునకుం జనుచుండ; నంతకు మున్న మత్స్యమహీవల్లభుం డాహవజయదర్పిత వాహినీ పరివృతుండై నగరంబు సొత్తెంచి.