Andhra Mahabharatamu 4.5.233
Āndhra Mahābhāratamu 4.5.233
- Language
- Telugu
4.5.233
వ. ఇవ్విధంబునం దన విజయంబుఁ గొనియాడ వచ్చిన వారి నెల్ల నభినందించి ‘యుత్తరుం డెచ్చట నున్న వాఁ?’ డని యడిగి వారల వలనం గురునాథుండు భీష్మద్రోణ కర్ణ కృపాశ్వత్థామాది యోధవీరులు బెరసిన బలంబులతోడ నడచి యుత్తరంబునఁ బసులం బట్టిన నతండు బృహన్నల సారథింగాఁ గైకొని యొక్కరుండ కుయివోవుట విని విషాద వేదనా దోదూయమాన మానసుం డగుచు మంత్రుల మొగంబు సూచి యిట్టనియె.