Andhra Mahabharatamu 4.5.244
Āndhra Mahābhāratamu 4.5.244
- Language
- Telugu
4.5.244
వ. అని నియోగించి గోపాలురకుం గట్ట నిప్పించి పుచ్చి, కంకు నాలోకించి ‘నెత్తం బొక పలక యాడుదమే?’ యని యుబ్బుమై మాటగాఁ బలికిన నతండు ‘నీవు సుమాళంబున న్నున్నవాఁడవు; నేఁడు నీతోడ నాడి జయింప రాదు వెఱతు’ ననిన విరాటుండు నగుచుఁ దత్ప్రదేశంబున మెలంగు సైరంధ్రిం గనుంగొని, సారెలు దెమ్మని పనిచి పలక ముందటికిఁ దిగిచికొనుచు ‘నిందు ర’మ్మనవుడుఁ బాండవాగ్రజుండు ‘జూదం బాడుట యెంత లెస్స!’ యనుచుం జేరి యాడందొడంగునప్పుడు మఱియు నిట్లనియె.