Andhra Mahabharatamu 4.5.260
Āndhra Mahābhāratamu 4.5.260
- Language
- Telugu
4.5.260
వ. ఇవ్విధంబున వ్రేటువడి యజాతశత్రుం డలుక గదురని హృదయంబుతోడం బాంచాలి దెసం జూడ్కిమలఁగ నూరకుండె; నన్నారీరత్నంబును రయంబునం జేరి వ్రేటుగంటిం దొరఁగు రుధిరంబుఁ దన యుత్తరీయంబున మెత్తన యొత్తి యచ్చేరువ నున్న కనకకలశంబు జలంబులం గరతలంబు దడిపికొని తుడుచున్నప్పుడు మత్స్య మహీవల్లభుం ‘డీశోణితంబు పైచీరం బట్టుటకుఁ గతం బేమి?’ యని తన్నడిగిన నతని కిట్లనియె.