Andhra Mahabharatamu 4.5.267
Āndhra Mahābhāratamu 4.5.267
- Language
- Telugu
4.5.267
వ. అని సారథ్య ప్రశంసా ప్రకారంబుగా నక్కుమారుం డత్యుపచార వచనంబుల చందంబున సంక్రందననందను నుతించుచుం జనుదెంచి రాజమందిర ద్వారంబుఁ జేరు నవసరంబునఁ బ్రతిహారి ససంభ్రమగతిం జని భూవల్లభునకుం బ్రణమిల్లి భూమింజయ ప్రవేశంబు తెఱంగు విన్నవించిన, ‘నా రథికసారథులం జూచు వేడ్క మనంబు వేగిర పెట్టెడు, నయ్యిరువుర నియ్యెడకుం జయ్యనఁ దోడితె’మ్మను విభుని పలుకులు విని ధర్మ తనయుండు పణిహారితో నల్లన యిట్లనియె.