Andhra Mahabharatamu 4.5.303
Āndhra Mahābhāratamu 4.5.303
- Language
- Telugu
4.5.303
వ. అని చెప్పి యుత్తరుం డతనిం బ్రమోదాయత్తచిత్తుం జేసె; నట్టి సమయంబునఁ గౌంతేయాగ్రజుండు ముఖ ప్రాంతంబు పై చీర చెఱంగునం బొదివికొని ధనంజయునిఁ జక్కం జూడక యుండె; విరాటుండు కిరీటి పరాక్రమంబు క్రమంబున నిట్లు దనతనయునివలన వినియునుం దెలియక యెప్పటి నపుంసకత్వ బుద్ధితోడన సంభావించి పోవం బనిచిన, బృహన్నలయును ‘జతురంబుగాఁ బలికి; తిదియ తెలుపు తెఱంగు; ధర్మనందనునకు నింతకు మిక్కిలి యెఱింగింపకుండునది’ యని వైరాటితో నల్లన చెప్పుచుం జనియె; నజ్జననాయకుండును గంకునిం బొమ్మని, యుచితపరివారపరివృతుండయి భూమింజయు నంతిపురంబునకుం దోడ్కొని యరిగి సుదేష్ణాసందర్శన సమాచరణంబు నడపి, యతం డడుగఁ ద్రిగర్తపతి నోర్చిన తెఱం గెఱింగించె; నట నరుండు నాట్యశాలకుం బోయి.