Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 4.5.305

Āndhra Mahābhāratamu 4.5.305

Language
Telugu

4.5.305

వ. ఇవ్విధంబునఁ గృతకృత్యుం డయి యథాపూర్వంబుగా మజ్జన భోజనంబులు సలిపి, ధర్మతనయు నివాసంబునం దేకాంత స్థలంబునఁ దా రేవురును ద్రౌపదియును గూడఁబడునట్టి తెఱంగు సంఘటించి, సమాగమ సముచిత ప్రకారంబు నడపి, గోగణ నివర్తనంబును రణప్రవర్తనంబును నన్యోన్య విదితంబులైన యనంతరంబ యగ్రజు నుద్దేశించి బీభత్సుండు భీమసేనున కిట్లనియె.