Andhra Mahabharatamu 4.5.314
Āndhra Mahābhāratamu 4.5.314
- Language
- Telugu
4.5.314
వ. అని పలికి వారల కుందు మాన్పి ‘యిది యట్ల కాక యొండు దగునే?’ యనుచుఁ దక్కినవారి దెసయుం గనుంగొనిన నెల్లవారు నుపశమించిరి; తదనంతరంబ తమ్ము నెఱింగించు తెఱంగు దలపోసి వారందఱు విరాటు కొలువు కూటంబునకుం బోయి బయలు మెఱసి యుండువారుగా నిశ్చయించి, యా రాత్రి గడపి వేగుటయుం గృతస్నాను లయి పాండుసూనులు సమయ విహితాచారంబులు నడపి యుచిత ప్రకారంబున.