Andhra Mahabharatamu 4.5.375
Āndhra Mahābhāratamu 4.5.375
- Language
- Telugu
4.5.375
వ. ఇవ్విధంబునం బ్రకాశులై పాండునందనులు శమీవృక్ష నిక్షిప్త సమస్త సాధనంబులుఁ బూజాపూర్వకంబుగాఁ దెచ్చుకొని, యుపప్లావ్యంబున వసియించి, మత్స్యమహీనాథుండు పంపుసేయం బెంపు మిగిలి పౌర జానపద సమానీత నానావిధోపహారంబులు గైకొనుచు, బహురత్నంబులకు భాజనంబులై మహనీయ విభూతి శోభిల్లుచున్నంత, వాసుదేవుండు బలభద్ర పురస్సరంబుగా సాత్యకి సమేతుండై సుభద్రాభిమన్యులం దోడ్కొని, కృతవర్మయుఁ బ్రద్యుమ్నుండును సాంబుండును యుయుధానుండును రుక్ముండును నక్రూరుండును నింద్రసేనాది పాండవ సారథులును రథారూఢులై కొల్చిరా, మఱియు ననేక యాదవ కుమారులును గరితురగ స్యందన నిబిడంబు లగు బలంబులతోడ నిరుగెలంకుల నడవం జనుదెంచి.