Andhra Mahabharatamu 4.5.389
Āndhra Mahābhāratamu 4.5.389
- Language
- Telugu
4.5.389
వ. ఇట్లు వైవాహిక వర్తన సంవిధాన సావధానుం డగు మత్స్యమహీనాథుండు మౌహూర్తికాది శిష్టజనులు పరివేష్టింప నుండి ‘లగ్నం బాసన్నం బగుచు వచ్చె’ నని ధర్మతనయున కెఱింగింపం బనిచిన, నతండు ననుజతనుజసహితంబుగా నలంకృతుండై, వివిధ ప్రసాధన శోభితులగు సమస్తబంధు జనంబులం గూర్చికొని యభిమన్యునకు శృంగారంబు సేయించి భద్రగజారూఢుం జేసికొని యేనుంగులం బేరుగలవారువంబులను మట్టపుదట్టంబు సేసికొని పుణ్యాంగనా జనంబులతోడం గూడి, మణిగణంబులు నంబర నికరంబులు పుష్పపుంజంబులు ఫలప్రచయంబులు లోనుగాఁ గల యోగ్యవస్తువుల విస్తరిల్లిన క్రంత నడవ మంగళతూర్య నాదంబులు విప్రాశీర్వాదంబులు మాగధ గానంబులు వందిజన వాక్య సంతానంబులుఁ జెలంగ వాసుదేవ పురస్సరంబుగా విరాటుమందిరంబున కేతెంచి శంఖజయ ఘంటా పణవాది నిక్వణంబులతోడ నెదుర్కొని చల్లుసేసలు గైకొనుచుం జొత్తెంచిన.