Andhra Mahabharatamu 4.5.403
Āndhra Mahābhāratamu 4.5.403
- Language
- Telugu
4.5.403
వ. ఇవ్విధంబున వివాహంబు నిర్వహించి మత్స్యమహీనాథుండు మణిభూషణంబులు రుచిరాంబరంబులుఁ గర్పూరాది సుగంధ ద్రవ్యంబులుఁ దాంబూలంబుల తోడి పళ్లెరంబులఁ బచరించి పాండవులకు వాసుదేవ పూర్వకంబుగాఁ గట్టనిచ్చి, పురోహిత ప్రకరంబునకు నిప్పించి, యాజ్ఞసేనీ సుభద్రలకు సనురూపాభరణ పరిధానంబు లంతఃపురవర్తు లైన యర్హ జనంబులచేతం బుచ్చి, సౌభద్రునకు భద్రసామజసప్తశతియును, లోకోత్తర తురంగ దశ సహస్రంబును, సలక్షణ గోపంచలక్షయు, రథంబులు రెండు వేలును, దాసదాసీ జనంబు లక్షయు, మఱియు నానా ప్రకారంబు లగు ధనంబులు నరణం బిచ్చె; నమ్మహనీయ మహోత్సవంబు మంగళ సంవిధాన సావధాన పుణ్యాంగనలవలనను, నృత్త గీతాది వైచిత్ర్య మనోహర వారనారీజనంబుల వలనను, వినూత్న రత్నమయ భూషణాది దీప్తవేష విరాజమాను లగు కుమారుల చతుర పరిహాసాది విలాసంబుల వలనను, బ్రభూత విభవ విభ్రాజితు లగు రాజసూనుల మాననీయ గరిమలలిత విహార విశేషంబులవలనను. బాంచాలయాదవ కేకయాది బాంధవ మహిత మహిమాంచిత సంచరణంబుల వలనను, నానంద నిష్యంది పాండునందన సౌహార్దంబు వలనను మత్స్యమనుజపతి మందిరంబు పరమ సంపద్భరితంబై యుండె’ నని చెప్పిన విని వైశంపాయనునితో జనమేజయుండు.