Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.1.268

Āndhra Mahābhāratamu 5.1.268

Language
Telugu

5.1.268

సీ. కవ లగ్రజన్ముల కంటె నేమిటఁ గీడు? | ద్రుపదుఁ డల్పుండె? తత్సుతులు బాహు
గర్వ సమగ్రులు గారె? విరాటుండు | నాతని తమ్ములు, నాత్మజులును
నసదులే? సాత్యకి యలఁతులఁ బోయెడు | వాఁడె? వృష్ణి కుమారవరు లనేకు
లట్టి యోధులు పోర నరవాయిఁ గొందురే? | పాండ్యుండుఁ, గేకయపతులు నాది
తే. యైన బంధులు, మిత్త్రులు నగ్గలికలఁ | గొఱఁత వడియెడు వారె? యందఱను గెల్వ
నోపినను రుద్రునకు నైన నోర్వరాని | ధర్మపుత్త్రు కోపమునకుఁ దలఁకవలదె?’