Andhra Mahabharatamu 5.1.272
Āndhra Mahābhāratamu 5.1.272
- Language
- Telugu
5.1.272
వ. శాంతి ప్రకారంబునం గార్యంబు నడపి యొక్కటియై మనుట యొడఁగూర్చి రమ్ము; రథం బెక్కి పొ’ మ్మని తగినతెఱంగున వీడ్కొలిపిన, సంజయుండునుం జని, యుపప్లావ్యంబు సొచ్చి, మాధవు మందిరంబున కరిగి, యభ్యంతర వినోదంబుల నరసహితుండై యున్న యన్నారాయణునకుం దనరాక యెఱింగించి పుచ్చి, తగఁ బ్రవేశించి, భయభక్తివినయ సంభ్రమంబులు మెఱయ వారలం గాంచి, యమ్మహాత్ము లిరువుర సంభావనంబులును, సంభాషణంబులునుం బడసి సంప్రీతచేతస్కుండై, మఱునాఁడు ధర్మతనయు నొడ్డోల గంబున్న సమయంబు వేచి, సముచితంబుగా నతనిం గని సాష్టాంగంబుగాఁ బ్రణమిల్లిన, నతండుం బ్రియపూర్వకంబుగా నాదరించి తన సమీపంబున నునిచికొనినం గొలిచియుండి యతని కిట్లనియె.