Andhra Mahabharatamu 5.1.325
Āndhra Mahābhāratamu 5.1.325
- Language
- Telugu
5.1.325
చ. రణమున వారలన్ గెలువరా దను పల్కు లటుండనిమ్ము; స
ద్గుణుఁడవు నీవు వచ్చితి; ప్రకోపశమంబుగఁ బల్కి; తింకసై
రణ దగఁ జేయువారము; పరాభవ మొందియు మున్ను వారి దు
ర్గుణములు సైఁచు టీవు నొకకొంత యెఱుంగుదు వింతయేటికిన్?