Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.1.331

Āndhra Mahābhāratamu 5.1.331

Language
Telugu

5.1.331

సీ. రాజసూయ మహాధ్వరం బట్లు నడపి స | ద్ద్విజులకు సురలకుఁ దృప్తిఁ జేసి,
శాంతియు దాంతియు సకలలోకంబులఁ | బొగడొంద బ్రదికిన పుణ్యమూర్తి
విట్టి నీ చరితంబు హింసాకళంకిత | మగు టెంత యొప్పదు? నదియుఁగాక
దుర్ణయవృత్తి దుర్ద్యూతంబు పుట్టించి | యంతలు సేసిన యట్టివారి
తే. నేల గర్వంబు సెల్లంగ నిచ్చి, జగము | చేతఁ దిట్టులు వడునట్లు సేసి పోయి
తేల? యడవుల నిమ్మెయి నిడుమ గుడిచి | తేల? తాల్మియ ధనముగా నింత వడితి.