Andhra Mahabharatamu 5.1.353
Āndhra Mahābhāratamu 5.1.353
- Language
- Telugu
5.1.353
సీ. పాండవేయులఁ దగం బ్రార్థించి, యందుల | కక్కట! యేనైన నరుగుదెంచి,
కౌరవులకు బుద్ధిగాఁ జెప్పి రాజ్యంబు | పాలుసేసిన, మృత్యుపాశములకుఁ
దప్పరే వారలు? దగవును నేర్పును | నా మీఁద నిలుచుట నాకుఁ గీడె?
నన్ను మన్నింతు; రన్యాయంబు సొరని నా | మాటకుఁ దా రొడఁబాటు లేక
తే. యుండుదురె? కేరడము లాడుచుండిరేనిఁ | గవియు పాండవ బాణాగ్ని గాదు సువ్వె,
తమ్ముఁ దమ లోభ మను చిచ్చు దరికొనంగఁ | దెగినవారయి పోదు; రింతియ తలంప.