Andhra Mahabharatamu 5.2.305
Āndhra Mahābhāratamu 5.2.305
- Language
- Telugu
5.2.305
వ. అనిన విని యంబికానందనుం ‘డట్లకాక’యని యొక కంచుకిం బిలిచి వానిం బుచ్చి గాంధారి రావించి, సద్భక్తి తాత్పర్యంబునఁ గృష్ణద్వైపాయన మహామునిం దలంచిన, దివ్యబోధ మహనీయుండైన యమ్మహాత్ముండు విజయం చేయుటకు, నందఱు దండ ప్రణామంబులు సేసి సమున్నతాసనంబున నునిచి, యర్ఘ్యపాద్యాది విధులం బూజించియున్న సమయంబున ధృతరాష్ట్రుండు విన్నపంబు సేయక మున్న యమ్మహాపురుషుండు ధృతరాష్ట్ర సంజయుల చిత్తవృత్తులు దాన యెఱింగినవాఁడగుటం జేసి, సంజయువలనఁ బ్రసన్న దృష్టి నవలోకించి యతని కిట్లనియె: