Andhra Mahabharatamu 5.2.304
Āndhra Mahābhāratamu 5.2.304
- Language
- Telugu
5.2.304
సీ. ‘ఈ రెండు వీళుల తారతమ్యంబులు | నెఱుఁగుదు; పోరైన నెవ్వ రోర్తు
రిది నిశ్చయింతమే? యెందు నుపాయంబుఁ | బౌరుషంబును గలవారు గలరు?
సూతము చెపు’ మన్న సూతనందనుఁడు ‘న | న్నడిగెద వే నొంటి యడుగవలదు;
మీ యయ్య సాత్యవతేయుఁ డీయెడకు వేం | చేయునట్లుగ భక్తిఁ జేసి తలఁపు;
తే. పిలువఁబంపు గాంధారి; వారలు వినీతి | రతులు, నిశ్చయవిదులు, ధర్మజ్ఞ చిత్తు;
లుల్లమున నీ కసూయాదు లొదవెనేని | పూని మాన్పంగ నేర్తురు మానవేంద్ర!’