Andhra Mahabharatamu 5.3.229
Āndhra Mahābhāratamu 5.3.229
- Language
- Telugu
5.3.229
సీ. సంభ్రమ స్నేహ నిశ్చల భక్తియుక్తిఁ బ | విత్ర మజ్జనము గావించి విదురుఁ
డెల్లవంటకమును నేర్పడ బోనాలు | వేర్పింప, నెంతయుఁ బ్రీతి ముంద
రోజమై బ్రాహ్మణభోజనం బొనరించి | సపరివారముగ విశాల రమ్య
పూత స్థలంబునఁ బుండరీకాక్షుండు | దమ్ముండు దాను నుత్సవ మెలర్ప
తే. సరస రంజక మహనీయ సంప్రయోగ | మగు చతుర్విధ హృద్యాన్న మారగించె
లలిత సంభావనా మంజులంబు లైన | పలుకు లెడనెడ విదురున కెలమి యొసఁగ.