Andhra Mahabharatamu 5.3.228
Āndhra Mahābhāratamu 5.3.228
- Language
- Telugu
5.3.228
వ. ఇట్లున్న మీ యందఱ యన్నంబులు దుష్టాన్నంబులు; విదురుం డొక్కని యన్నంబు భోక్తవ్యంబని నిశ్చయించితిఁ గావున నందుఁ బోయెద’నని చెప్పి యజ్జనపతి యనుమతి సేయఁ జనునప్పుడు తోడన బాహ్లిక భీష్మాది కౌరవులును గుంభసంభవ ప్రముఖులైన మాన్యులును జని మాధవుతోడ ‘మా యిండ్ల నెల్లను గానిక లాయి తంబులు చేసికొని నీవు విజయం చేయుటకు నెదురు చూచుచున్న వార’మని పల్కి ప్రార్థించిన ‘నే నన్ని చోట్లకు వచ్చిన వాఁడన; యందఱ యర్చనలుం గైకొంటిన; మీరు నిలువుం’డని వారల నిలిపి విదురు గృహంబునకుం బోయిన.