Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.3.388

Āndhra Mahābhāratamu 5.3.388

Language
Telugu

5.3.388

వ. మున్ను దనతోడం జనిన వార లందఱు నచ్చోటన నిలువ నిట్లువచ్చి సుయోధనుండు నిజాసనాసీనుండై యున్నఁజూచి తల్లి చిత్తంబున గర్హించుచు నతనికి ధర్మంబును నీతియును జుట్టఱికంబును బ్రదుకుఁదెరువును నిజశక్తియు సహాయంబు గొలందియుఁ గులజన చిత్త ప్రకారంబున బాండుపుత్త్రుల బలపరాక్రమంబులుఁ దెలియునట్లుగాఁ దెఱంగుపడం జెప్పి, బుజ్జగించియుం గినిసియు ననేక విధంబుల నాడిన నమ్మాటల దెస ననాదరంబు సేసి యుద్ధతిం గ్రమ్మఱం జని యతండు కర్ణాదులం గలిసి వారునుం దానును దుర్మం త్రంబునకుం జొచ్చి.