Andhra Mahabharatamu 5.4.257
Āndhra Mahābhāratamu 5.4.257
- Language
- Telugu
5.4.257
సీ. వారందఱును ధర్మవైభవంబునఁ, దప | స్సంపద నెక్కుడు జనులకెల్ల
ధనువు నాఱంగంబులను బరిణతులు దాఁ | కోర్తురు; పరులకు నోర్వరాని
కోల్తల గలరు; పెక్కులు పరాక్రమములు | వేర్వేఱ చేసిన వీరు లొక్క
మొగ మయి తాఁకిన వెగడంద కుండునే? | మనసేన ము న్నవమాన పాటు
ఆ. దుఃఖపాటు గలిగి తొడరంగ వచ్చిన | వారుగాన నలఁతిఁ బోరు; ప్రాణ
మాసపడక యోపినంతయుఁ బెనఁగుదు | రది సహించి నిలుచు టరిది మనకు.