Andhra Mahabharatamu 5.4.260
Āndhra Mahābhāratamu 5.4.260
- Language
- Telugu
5.4.260
సీ. ‘ద్రౌపదేయులు మహారథు లేవురును; వారి | తరమ యుత్తరుఁడును ధరణినాథ!
యతిరథవర్యుఁ డయ్యభిమన్యుఁ; డర్జున | వాసుదేవుల కెనవచ్చువాఁడు;
లఘుచిత్రములు నేర్చు లావును దాల్మియుఁ | గలఁడు తండ్రులపాటు తలఁచుచుండుఁ
గావున బెడిదంబుగాఁ బోరు; సాత్యకి | యతిరథోత్తముఁడు శౌర్యాన్వితుండు;
తే. పాండవ స్నేహసక్తుఁడై యుండుఁ గాన | నలుక మనమీఁదఁ బెద్దయుఁ గలిగి పెనఁగు;
వీర లిరువురుఁ బరుసనివారు సమర | పరుల నొప్పింతు రీ యోధవరులనెల్ల.