Andhra Mahabharatamu 5.4.266
Āndhra Mahābhāratamu 5.4.266
- Language
- Telugu
5.4.266
సీ. చిత్రాయుధుండును జేకితానుండు మ | హారథు లిద్దఱు నర్జునునకుఁ
గూర్తురు, కయ్యాన కోర్తురు, నేర్తు, రా | యుధముల కెల్ల నత్యుగ్రు; లవ్వి
ధము వార; చంద్రదత్త వ్యాఘ్రదత్తులు | వినుము సేనాబిందుఁడను నృపాలుఁ
డతిరథోత్తముఁడు మారుత పుత్త్రు నెన యతం | డొక్కరుండును వారి యుఱిది లావు
ఆ. పాండ్యుఁ డతిరథుండు బలఁగంబుఁ గలవాఁడు | సమరథుండు కాశ్యుఁ డమితబలుఁడు
కుంతిభోజుఁ డాజికోవిదుఁ డతిరథుం | డతని యొద్దిజోదు లధికబలులు.