Andhra Mahabharatamu 5.4.265
Āndhra Mahābhāratamu 5.4.265
- Language
- Telugu
5.4.265
వ. ఉత్తమౌజుండును యుధామన్యుండును క్షత్త్ర దేవుండును జయంతుండును నమితౌజుండును విరాటుండును సత్యజితుండును ననం బరఁగు పాంచాల కుల ప్రదీపకులు మహారథులు; మత్తమాతంగ బృందంబు చందంబునం బ్రతిబలంబు పయిం గవిసి కోలాహల బహుళంబుగాఁ గలంపం జాలుదురు; కేకయపతు లేవురు సహోదరులు మహారథులు, కడింది మగలు, కెంపు రథంబుల మొత్తంబులతోఁ గార్చిచ్చు పగిదిం బొదువుదురు; కాశీశుండు నీలుండు సూర్యదత్తుండు మదిరాక్షుండు శంఖుండు విరాటజ్ఞాతులు మహారథులు వివిధాయుధ విద్యా విశారదులు; వారి పోరు భరంబై యుండు.