Rayavacakamu 4.32
Rāyavācakamu 4.32
- Language
- Telugu
4.32
క. తరుణుండై నవరత్నా
భరణుండై గంధపుష్పపరిమళయుతుఁడై
సరనాయిక పరివృతుఁడై
పరఁగినవాఁడ మరు నిట సభాపతియనఁగన్.
క. శ్రీరమ్యుడు విజయుండును
ఢీరోదాత్తుండు సుగుణతేజో నిధియై
యారయ సింహాసనమున
నారూఢుం డగుట యెప్పు నాసభ నడుమన్.