Andhra Mahabharatamu 1.8.325
Āndhra Mahābhāratamu 1.8.325
- Language
- Telugu
1.8.325
గద్య. ఇది సకలసుకవిజనవినుత నన్నయభట్టప్రణీతం బైన శ్రీమహాభారతంబునం దాదిపర్వంబున విదురాగమనంబును, గృష్ణసందర్శనంబును, రాజ్యార్ధలాభంబును, ఖాండవప్రస్థనివాసంబును, సుందోపసుందోపాఖ్యానంబును, నారదువచనంబున ద్రౌపదియందు సమయక్రియయు, నర్జునుతీర్థాభిగమనంబును, నులూచిసమాగమంబును, జిత్రాంగదయందు బభ్రువాహనుజన్మంబును, ద్వారకాగమనంబును, వాసుదేవానుమతుం డయి యర్జునుండు సుభద్ర వివాహం బగుటయు, సుభద్రాహరణంబును, హరణహారికయు, నభిమన్యుసంభవంబును, గాండీవ దివ్యరథాశ్వలాభంబును, ఖాండవదహనంబును, నగ్నిభయంబువలన మయభుజంగమోక్షణంబును, మందపాలోఖ్యానంబును నన్నది సర్వంబును నష్టమాశ్వాసము.