Andhra Mahabharatamu 3.1.340
Āndhra Mahābhāratamu 3.1.340
- Language
- Telugu
3.1.340
వ. ఇట్లు దివ్యపురుషుండైన పార్థుండు లబ్ధదివ్యదృష్టియై యమర్త్యరూపధరులైన పితృదేవతలతోడం దనముందట నిలిచిన మహానీలవర్ణుండైన వైవస్వతుని, వైడూర్యవర్ణుండై యర్ణవ నదీ శైల సేవింతుడైన వరుణేశ్వరుం, జాంబూనద వర్ణుండై యక్ష రాక్షస గణంబుతో నున్న కుబేరునిం జూచి, వారివలన దివ్యాస్త్రంబులు వడసి వాక్పుష్ప ఫల జలంబుల నందఱం దృప్తులం జేసి వెండియు.