Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.1.342

Āndhra Mahābhāratamu 3.1.342

Language
Telugu

3.1.342

ఉ. ఇందుధరప్రసాదమున నిష్టవరంబులు గాంచి బాంధవా
నంద విధాయి యైన నిజనందును దండితశత్రు సద్గుణా
నందితుఁ జూచి వేడ్క నయనంబులు వేయును గన్న తత్ఫలం
బందెఁ బురందరుండు పరమాద్భుత సమ్మదపూరితాత్ముఁడై.