Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.2.324

Āndhra Mahābhāratamu 3.2.324

Language
Telugu

3.2.324

వ. ఇంకనైనను నీవు వివాహంబై సంతానంబు వడసిన మాకుఁ బుణ్యగతి వడయ నగు’ ననిన ‘నట్ల చేయుదు’ నని యగస్త్యుండు తన తపశ్శక్తింజేసి పుత్త్రకాముండైన విదర్భరాజున కొక్కకూఁతుం బుట్టించిన నది లోపాముద్ర యను నామంబుతో జలంబులయందు నలినియుంబోలె వినీతునందు లక్ష్మియుంబోలె నుద్యుక్తునందు విద్యయుం బోలెఁ బెరిఁగి యౌవనంబు దాల్చి రూపవతియై వయోరూపంబుల ననురూప లయిన కన్యకా శతంబుతో నొప్పుచున్నంత.