Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.2.345

Āndhra Mahābhāratamu 3.2.345

Language
Telugu

3.2.345

సీ. ‘ఈ రాజవరులతో నేను ధనార్థినై | వచ్చితి నీకు ద్రవ్యంబు గలుగు
టెఱిఁగి’ నావుడు ‘నటులేని మీ కభిమత | మెంత యంతియ ధనమిత్తు’ ననినఁ
‘బదివేలు మొదవులు బదివేల గద్దియల్‌ | పసిఁడియు నిమ్మహీపతుల కిమ్మ
యొక్కొక్కనికి మఱి యొక్కని కిచ్చిన | దానికి రెట్టి గోధనము నొక్క
ఆ. హేమమయరథంబు నిమ్ము నా’ కనిన ని | ల్వలుఁడు దత్‌క్షణంబ తలఁచి యిచ్చె
నయ్యగస్త్యుచెప్పినంత ధనంబు ము | వ్వురు మహీపతులకుఁ గరము నెమ్మి.